ఎలుగుబంటి దాడిలో రైతుకు తీవ్రగాయాలు | Bear attacks farmer | Sakshi
Sakshi News home page

ఎలుగుబంటి దాడిలో రైతుకు తీవ్రగాయాలు

Sep 5 2015 8:20 PM | Updated on Oct 1 2018 4:01 PM

ఎలుగుబంటి దాడిలో ఓ రైతుకు తీవ్ర గాయాలయ్యాయి.

ఆమ్రాబాద్ (మహబూబ్‌నగర్ జిల్లా) : ఎలుగుబంటి దాడిలో ఓ రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా ఆమ్రాబాద్ మండలం ముక్తేశ్వరం గ్రామానికి చెందిన రైతు ముక్త్యాలు(40) శనివారం సాయంత్రం పొలంలో వ్యవసాయ పనుల్లో ఉన్నాడు. కాగా రాత్రి 7 గంటల సమయంలో సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఓ ఎలుగుబంటి అతడిపై దాడికి దిగింది. సమీపంలోనే ఉన్న రైతులు వెంటనే కర్రలతో వచ్చి ఎలుగుబంటిని పారదోలారు. ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడిన ముక్త్యాలును అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement