అడుక్కోడానికి బీసీలు బిచ్చగాళ్లు కాదని.. పోరాడి సాధించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు.
మహబూబ్‌నగర్ : అడుక్కోడానికి బీసీలు బిచ్చగాళ్లు కాదని.. పోరాడి సాధించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ పట్టణ శివారులోని రాఘవేంద్ర ఫంక్షహాల్‌లో జరిగిన తెలంగాణ గొర్రె కాపరుల నెట్‌వర్క్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూ.20వేల కోట్లతో బీసీలకు సబ్‌ప్లాన్ అమలు చేయాలన్నారు. కల్యాణమస్తు పథకాన్ని బీసీలకు వర్తింపజేయాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని హెచ్చరించారు.
కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ సర్పంచులకు చెక్‌పవర్ రద్దు చేయడం వెనుక కేసీఆర్ కుట్ర దాగుందన్నారు. అగ్రవర్ణాల వారికే మంత్రి పదవులు ఇచ్చి కేసీఆర్ దొరతనాన్ని నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు.