గణనాధుడి శోభాయాత్ర సందర్భంగా పోలీసుల తీరుకు నిరసనగా అఖిలపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా బంద్ కొనసాగుతోంది
కొనసాగుతున్న కామారెడ్డి బంద్
Sep 6 2017 1:32 PM | Updated on Sep 12 2017 2:04 AM
కామారెడ్డి: గణనాధుడి శోభాయాత్ర సందర్భంగా పోలీసుల తీరుకు నిరసనగా అఖిలపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా బంద్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా పట్టణంలోని సుభాష్‌రోడ్‌లో గత ప్రధాన రహదారిపై వంటా-వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వేలాది మందితో భారీర్యాలీ చేపట్టారు. కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతలను సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Advertisement


