తెలంగాణలో కొనసాగుతున్న బంద్ | Bandh Continuous in telangana districts | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొనసాగుతున్న బంద్

May 29 2014 9:17 AM | Updated on Aug 21 2018 8:34 PM

పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలుపుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకిస్తూ తెలంగాణలోని పది జిల్లాలలో బంద్ కొనసాగుతోంది.

హైదరాబాద్ : తెలంగాణావ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలోని ఏడు పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను నిరసిస్తూ టీఆర్ఎస్ తెలంగాణలో బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగానే  ఆధ్వర్యంలో వివిధ శ్రేణులు ఆర్టీసీ డిపోల ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.

దీంతో తెలంగాణ పది జిల్లాల్లోని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మరోవైపు వర్తక, వ్యాపార, వాణిజ్య, ప్రైవేట్ సంస్థలు, ఆర్టీసీ యూనియన్లు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. అత్యసవసర సేవలకు ఈ బంద్ నుంచి మినహాయింపునిచ్చారు. అయితే బస్సులు నిలిచిపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సందట్లో సడేమియాలా బంద్ నేపథ్యంలో ఆటోలు, ప్రయివేట్ వాహనదారులు ప్రయాణికుల నుంచి పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement