బూర్గులకు గవర్నర్‌ దత్తాత్రేయ నివాళి

Bandaru Dattatreya Speech In Burgula Ramakrishna Rao Vardhanti - Sakshi

హైదరాబాద్‌ రాష్ట్రానికి సేవలందించిన గొప్పవ్య​క్తి బూర్గుల

సాక్షి, హైదరాబాద్‌: నిస్వార్థ నాయకుడిగా, హైదరాబాద్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విశేష సేవలు అందించిన మహావ్యక్తి బూర్గుల రామకృష్ణారావు అని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కొనియాడారు. దత్తాత్రేయ శనివారం బూర్గుల వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్‌ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్‌, కేరళ రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలందించిన గొప్పవ్యక్తి అని తెలిపారు. దత్తాత్రేయ హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ హోదాలో నగరానికి రావడంతో జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ జయరాజ్‌ కెనడీ, సీసీఆర్‌ఓ వెంకటరమణ ఘనంగా స్వాగతం పలికారు.  కాగా  బండారు దత్తాత్రేయ ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌ 27వ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top