నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసమే తాను టీఆర్ఎస్లో చేరుతున్నట్టు జిల్లా పరిషత్ చైర్మన్ బాలూ నాయక్ స్పష్టం చేశారు.
నల్లగొండ: నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసమే తాను టీఆర్ఎస్లో చేరుతున్నట్టు జిల్లా పరిషత్ చైర్మన్ బాలూ నాయక్ స్పష్టం చేశారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ఏవిధమైన ఒత్తిడులు లేవని ఆయన అన్నారు.
కేవలం నల్లగొండ జిల్లా అభివృద్ధికై టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రేపు తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు ఆయన తెలిపారు.