119 స్థానాల్లో పోటీ చేస్తాం: బీఎల్‌ఎఫ్‌

Bahujan Left Front to contest all TS seats - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తా మని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ కన్వీనర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. బుధవారం బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. వివరాలను తమ్మినేని మీడియాకు వివరించారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టుగా చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు కమిటీలను నియమించినట్టు చెప్పారు.

మూడునెలల్లో బీఎల్‌ఎఫ్‌ కార్యాచరణపై చర్చించామని తెలిపారు. జూలై, ఆగస్టుల్లో నియోజకవర్గస్థాయి బహిరంగసభలను నిర్వహిస్తామన్నారు. సామాజికన్యాయం లక్ష్యంతో పనిచేస్తున్న సీపీఐ కూడా కలసి రావాలని, ఆ పార్టీ ప్రధాన కార్య దర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, నేతలను కోరామని తమ్మినేని వెల్లడించారు. మంద కృష్ణమాదిగ, ఆర్‌.కృష్ణయ్య, జస్టిస్‌ చంద్రకుమార్, చెరుకు సుధాకర్, కోదండరాం వంటివారితోనూ చర్చలు జరుపుతున్నట్టు తమ్మినేని చెప్పారు. బీఎల్‌ఎఫ్‌ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ సామాజిక న్యాయమంటే బర్రెలు, గొర్రెలు, చీరలు పంచడం కాదన్నారు.  బీఎల్‌ఎఫ్‌ ఓసీలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top