బాహుబలులు అధికారంలోకి రారు | Bahubali's will not form a Government | Sakshi
Sakshi News home page

బాహుబలులు అధికారంలోకి రారు

Mar 21 2017 4:02 PM | Updated on Sep 5 2017 6:42 AM

బాహుబలులు అధికారంలోకి రారు

బాహుబలులు అధికారంలోకి రారు

బాహుబలి సినిమా పేరు ప్రస్తావించే వారు సినిమాలకో,కుస్తీపోటీలకు పొతే మంచిదని..

హైదరాబాద్‌: బాహుబలి సినిమా పేరు ప్రస్తావించే వారు సినిమాలకో, కుస్తీపోటీలకు పొతే మంచిదని కాంగ్రెస్‌ నేత మల్లు రవి సలహా ఇచ్చారు. అసెంబ్లీలో జానారెడ్డి చేసిన బాహుబలి కామెంట్లపై ఆయన స్పందించారు. కాంగ్రెస్ కుస్తీపోటీల పార్టీ కాదని అన్నారు. రాజకీయాల్లో బాహుబలికి స్థానం లేదని తెలిపారు.
 
రాజకీయాలంటే సినిమాలు కాదని, రాజకీయాల్లో బాహుబలులు ఉండరు అని తెలిపారు. ‘నెహ్రూ ..ఇందిర.. వైఎస్’లు బాహుబలులు కారని అన్నారు. సామాన్యప్రజల మద్దతు కూడగట్టడం ద్వారానే అధికారంలోకి వస్తారుని తెలిపారు. బాహుబలులు అయితే అధికారంలోకి రారని జానారెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement