‘అంబేద్కర్‌ కూడా వ‍్యతిరేకించారు’ | b.r ambedkar also opposed the caste reservations | Sakshi
Sakshi News home page

‘అంబేద్కర్‌ కూడా వ‍్యతిరేకించారు’

Mar 18 2017 7:04 PM | Updated on Mar 29 2019 9:31 PM

‘అంబేద్కర్‌ కూడా వ‍్యతిరేకించారు’ - Sakshi

‘అంబేద్కర్‌ కూడా వ‍్యతిరేకించారు’

మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తెలిపారు.

హైదరాబాద్‌: మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తెలిపారు. టీఆర్‌ఎస్‌ సర్కారుకు ఈ విషయం తెలిసి కూడా మొండిగా వ్వవహరిస్తోందని విమర్శించారు.

మతపరమైన రిజర్వేషన్లపై ఈ నెల 24న  బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో చేపట్టే చలో అసెంబ్లీ ముట్టడి పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లవని రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ ఏనాడో చెప్పారని ఆయన గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలను మర్చిపోయి కొత్త  అంశాలను తెరపైకి తెస్తోందని, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement