‘న్యాయశాఖ’ జాతీయ అధ్యక్షుడిగా బి.లక్ష్మారెడ్డి | B Lakshmareddy Appointed National President Of Justice Department | Sakshi
Sakshi News home page

‘న్యాయశాఖ’ జాతీయ అధ్యక్షుడిగా బి.లక్ష్మారెడ్డి

Dec 16 2019 2:13 AM | Updated on Dec 16 2019 2:13 AM

B Lakshmareddy Appointed National President Of Justice Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బిహార్‌లో జరిగిన ఆల్‌ ఇండియా న్యాయశాఖ ఉద్యోగ సంఘాల సమావేశంలో సంఘం జాతీయ అధ్యక్షుడిగా బి.లక్ష్మారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 29 రాష్ట్రాల సంఘాలు ఆ సమావేశానికి హాజరుకాగా, దేశంలోని 78 శాతం సంఘాలు లక్ష్మారెడ్డికి మద్దతు తెలిపాయి. రంగారెడ్డి జిల్లాలోని కుమ్మేర గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ న్యాయ శాఖ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. 2015 నుంచి జాతీయ న్యాయశాఖ ఉద్యోగుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నారు 

Advertisement
 
Advertisement
Advertisement