కల్తీ నూనె స్థావరంపై దాడులు | Attacks on duplicate cooking oil extracted from animal bones | Sakshi
Sakshi News home page

కల్తీ నూనె స్థావరంపై దాడులు

Oct 29 2015 11:14 AM | Updated on Sep 3 2017 11:41 AM

జంతు కళేబరాలు, కొవ్వు నుంచి నూనె తయారు చేస్తున్న స్థావరంపై పోలీసులు దాడులు చేశారు.

నిజామాబాద్: జంతు కళేబరాలు, కొవ్వు నుంచి నూనె తయారుచేస్తున్న స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామ సమీపంలో జంతు వ్యర్థాల నుంచి నూనె తయారు చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.

దీంతో ఎస్సై ఉపేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో దాడి చేశారు. 50 నూనె డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాడులను గమనించిన నిర్వాహకులు పరారు కాగా ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement