పెరిగిన వంట నూనె ధరలు.. కారణం ఇదే! | Palm Oil Drives Growth in Edible Oil Imports | Sakshi
Sakshi News home page

పెరిగిన వంట నూనె ధరలు.. కారణం ఇదే!

May 19 2026 5:36 PM | Updated on May 19 2026 5:42 PM

Palm Oil Drives Growth in Edible Oil Imports

వంటనూనెల దిగుమతులు 2025–26 నూనెల సీజన్‌లో (నవంబర్‌–ఏప్రిల్‌) 13 శాతం పెరిగి 7.94 మిలియన్‌ టన్నులకు చేరుకున్నాయి. ముఖ్యంగా పామాయిల్‌ దిగుమతులు భారీగా పెరిగినట్టు సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఈఏ) ప్రకటించింది. అంతక్రితం సంవత్సరం ఇదే కాలంలో దిగుతులు 7.04 మిలియన్‌ టన్నులుగా ఉన్నాయి.

విలువ పరంగా చూస్తే రూ.73,000 కోట్ల నుంచి రూ.87,000 కోట్లకు చేరాయి. మొత్తం నూనెల దిగుమతుల్లో వంటనూనెలు 7.82 మిలియన్‌ టన్నులుగా ఉంటే, 1,21,000 టన్నులు నాన్‌ ఎడిబుల్‌ నూనెలు ఉన్నాయి. పామాయిల్‌ దిగుమతులు దాదాపు రెట్టింపై 3.97 మిలియన్‌ టన్నులకు చేరాయి. సోయాబీన్, సన్‌ఫ్లవర్‌ నూనెల దిగుమతులు 3.85 మిలియన్‌ టన్నులకు తగ్గాయి.

పామాయిల్‌ ధరలు 14–15 శాతం, సోయాబీన్, సన్‌ఫ్లవర్‌ నూనెల ధరలు 17–22 శాతం మేర పెరిగాయి. ముఖ్యంగా డాలర్‌తో రూపాయి విలువ పడిపోవడంతో దిగుమతి ఖర్చులు భారీగా పెరిగాయి. మే చివరికి దేశంలో మొత్తం నూనె నిల్వలు 2.12 మిలియన్‌ టన్నులకు చేరాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement