ఆర్మీ జవాన్‌ కీచక చర్య | Army Jawan Arrested In Rape Attempt Case | Sakshi
Sakshi News home page

ఆర్మీ జవాన్‌ కీచక చర్య

Jul 25 2018 7:09 PM | Updated on Sep 4 2018 5:07 PM

Army Jawan Arrested In Rape Attempt Case - Sakshi

ఇంటర్‌ చదువుతున్న ఓ యువతి మరో వ్యక్తితో ఉన్నప్పుడు ఆర్మీ జవాన్‌ యువతిపై అత్యాచారయత్నం చేశాడు..

సాక్షి, హైదరాబాద్‌ : ఒంటరిగా ఉన్న జంటపై దాడిచేసి, యువతిపై అత్యాచార యత్నం చేసిన ఆర్మి జవాన్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. ఈ నెల 23న తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అమ్మూగూడాలో ఇంటర్‌ చదువుతున్న ఓ యువతి మరో వ్యక్తితో ఉన్నప్పుడు బ్రిజేష్‌ కుమార్‌ అనే జవాన్‌ యువతిపై అత్యాచారయత్నం చేశాడు. అడ్డువచ్చిన ఆ యువకుడిని చితబాదాడు.  ఈ మేరకు కేసు విచారించిన పోలీసులు నిందుతుడని అదుపులోకి తీసుకున్నారు.

అతన్ని మీడియా ముందు ప్రవేశపెట్టిన సీపీ అంజన్‌ కుమార్‌ మాట్లాడుతూ.. బ్రిజేష్‌ కుమార్‌ అనే ఆర్మీ జవాన్‌ అత్యాచారయత్నం చేసినట్లు ఆధారాలు లభించడంతో అతన్ని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగిందని.. దానిపై మరింతగా విచారించిస్తే ఆ కేసుతో కూడా ఇతనికి సంబంధం ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. గతంలో బ్రిజేష్‌ ఎక్కడెక్కడ పని చేశాడో, అతనికి నేర చరిత్ర ఏమైన ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అంజన్‌ కుమార్‌ మీడియాకు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement