జెరూసలేంలో జగన్‌ను కలిసిన ఆర్మూర్‌ వాసులు  | Armoor People Met YS Jagan-Mohan-Reddy In Jerusalem | Sakshi
Sakshi News home page

జెరూసలేంలో జగన్‌ను కలిసిన ఆర్మూర్‌ వాసులు 

Aug 4 2019 12:23 PM | Updated on Aug 4 2019 12:44 PM

Armoor People Met YS Jagan-Mohan-Reddy In Jerusalem - Sakshi

ఇజ్రాయిల్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఆర్మూర్‌వాసులు

సాక్షి, ఆర్మూర్‌ : జెరూసలెం పర్యటనలో భాగంగా ఇజ్రాయిల్‌ వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఇజ్రాయిల్‌ తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ అసోసియేషన్‌కు చెందిన ఆర్మూర్‌ వాసులు శనివారం కలిసి తమ అభిమానాన్ని చాటారు. ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామానికి చెందిన గంగాధర్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో తన కొడుకుకు వైఎస్సార్‌ అని నామకరణం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఉపాధి వేటలో తాము ఇజ్రాయిల్‌ వచ్చినా ప్రతీ ఏటా తమ ప్రియతమ దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి, వర్ధంతి నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుతున్న తీరును జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారని పేర్కొన్నారు. జగన్‌ను కలిసిన వారిలో అంకాపూర్‌ తిరుపతిగౌడ్, ప్రశాంత్, కలిగోట్‌ చరణ్‌గౌడ్‌ తదితరులున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement