2న హైదరాబాద్‌లోఅర్చక శంఖారావం | archakula shankharavam on april 2nd | Sakshi
Sakshi News home page

2న హైదరాబాద్‌లోఅర్చక శంఖారావం

Mar 31 2014 1:10 AM | Updated on Sep 4 2018 5:07 PM

వచ్చే నెల రెండోతేదీన హైదరాబాద్‌లో ‘అర్చక శంఖారావం’ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ అర్చక సమాఖ్య ఉపాధ్యక్షులు డాక్టర్ ఎంవీ సౌందరరాజన్, ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయబాబు, కార్యదర్శి పెద్దింటి రాంబాబు తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల రెండోతేదీన హైదరాబాద్‌లో ‘అర్చక శంఖారావం’ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ అర్చక సమాఖ్య ఉపాధ్యక్షులు డాక్టర్ ఎంవీ సౌందరరాజన్, ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయబాబు, కార్యదర్శి పెద్దింటి రాంబాబు తెలిపారు. వారు ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అర్చక సమాఖ్యల సంయుక్త ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తున్నామని, హైదరాబాద్‌లోని మున్నూరు కాపు సంఘం భవనంలో ఈ సభ జరుగుతుందని చెప్పారు. రెండోతేదీన ఉదయం 9 గంటలకు సామూహిక బ్రహ్మయజ్ఞం, ఉదయం 10 నుంచి 11 గంటల వరకు మహాశాంతియాగం పూర్ణాహుతి, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 5 గంటల వరకు సభాకార్యక్రమం ఉంటుందని తెలిపారు.

 

ఈ సభలో పలు రాజకీయపార్టీల నేతలు, పత్రికా సంపాదకులు, ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులు, అర్చకసంఘ ప్రతినిధులు ప్రసంగిస్తారని తెలిపారు. అన్ని జిల్లాల అర్చక సమాఖ్య నాయకులు, అర్చకులు పెద్దసంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని వారు కోరారు. సమావేశంలో పాల్గొనే అర్చకులు విధిగా ఆగమ సాంప్రదాయ పద్ధతిలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement