సొంత ఇల్లు ఉన్నా టెంటు నీడన.. | Although the shadow of his own house tentu | Sakshi
Sakshi News home page

సొంత ఇల్లు ఉన్నా టెంటు నీడన..

Aug 20 2014 1:08 AM | Updated on Sep 2 2017 12:07 PM

సొంత ఇల్లు ఉన్నా టెంటు నీడన..

సొంత ఇల్లు ఉన్నా టెంటు నీడన..

నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన సంగని సాయిబాబా ఉపాధి కోసం కొద్ది రోజుల క్రితం అనంతపురం జిల్లాకు కుటుంబం సహా వెళ్లారు.

నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన సంగని సాయిబాబా ఉపాధి కోసం కొద్ది రోజుల క్రితం అనంతపురం జిల్లాకు కుటుంబం సహా వెళ్లారు. ఇక్కడ ఉన్న ఆయన నివాస గృహాన్ని ఇతరులకు అద్దెకు ఇచ్చారు. సర్వే కోసం సోమవారం స్వగ్రామానికి వచ్చారు.

అద్దెకు ఉన్నవారు ఇంటికి తాళం వేసుకుని తమ ప్రాంతానికి సర్వే కోసం వెళ్లిపోయారు. దీంతో సాయిబాబా ఇంటి ఎదుట ఒక టెంటును ఏర్పాటు చేసుకుని రెండు రోజుల పాటు కుటుంబసభ్యులతో గడిపి సర్వేలో వివరాలను నమోదు చేయించుకున్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement