అభివృద్ధికి నిధులు కేటాయించాలి | Allocate Funds for Ward Developments | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి నిధులు కేటాయించాలి

Mar 28 2018 8:00 AM | Updated on Aug 29 2018 4:18 PM

Allocate Funds for Ward Developments - Sakshi

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న నాయకులు

నల్లగొండ టూటౌన్‌ : పట్టణంలోని 13వ వార్డు అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి కోరారు. 13వ వార్డు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వార్డు సమస్యల పరిష్కారం కోసం మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన 108 గంటల ధర్నాకు ఆయన మద్ధతు తెలిపి మాట్లాడారు. స్లమ్‌ ఏరియాలో ఉన్న వార్డుకు అధిక నిధులు కేటాయించాలని, వార్డులోని అన్ని కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అభివృద్ధి చెందిన వార్డులకు, అభివృద్ధి చెందని వార్డులకు నిధులు సమానంగా కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు. వార్డులోని అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా ఎఫ్‌సీఐ రోడ్డు, శ్మశానవాటికకు నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో సయ్యద్‌ హాశం, దండెంపల్లి సత్తయ్య, నర్సిరెడ్డి, కృష్ణారెడ్డి, అద్దంకి నర్సింహ, బోడ ఇస్తారి, పోలె సత్యనారాయణ, వార్డు కౌన్సిలర్‌ ఎండి.సలీం, ఆళ్ల బసవయ్య, గాదె నర్సింహ, పాక లింగయ్య, నోముల యాదయ్య, శంకర్‌ పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement