
'తెలంగాణలో అన్నిదారులు టీఆర్ఎస్ వైపే'
తమ ఉనికిని కాపాడుకునేందుకే తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ యాత్రలు చేపట్టాయని మంత్రి తన్నీరు హరీష్రావు విమవర్శించారు.
హైదరాబాద్: తమ ఉనికిని కాపాడుకునేందుకే తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ యాత్రలు చేపట్టాయని మంత్రి తన్నీరు హరీష్రావు విమవర్శించారు. ప్రజల భరోసా లేని కాంగ్రెస్ పార్టీ పార్టీ భరోసా యాత్రలు చేస్తోందని ఎద్దేవా చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమన్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని గుర్తు చేశారు. తెలంగాణలో అన్నిదారులు టీఆర్ఎస్ వైపే అని హరీష్రావు వ్యాఖ్యానించారు.