హైదరాబాద్ నగర సమస్యలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మంగళవారం సచివాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు.
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర సమస్యలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మంగళవారం సచివాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి ఆయా పార్టీల అధ్యక్షులు, శాసనసభాపక్ష నాయకులను ఆహ్వానిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలు అంశాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకున్న తరువాతే.. ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి చెప్పిన సంగతి తెలిసిందే.
అందులో భాగంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నగరంతోపాటు శివారుల్లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు, మూడు ప్రాంతాల్లో మెట్రో రైల్ అలైన్‌మెంట్‌ల మార్పులపై చర్చించాలని నగరవాసుల నుంచి డిమాండ్ ఉంది. వినాయక్‌సాగర్ ఏర్పాటు, వినాయక, బతుకమ్మ, దుర్గామాత విగ్రహాల నిమజ్జనాలకు ప్రత్యామ్నాయ ఏర్పాటుపై కూడా చర్చించనున్నారు.