గ్రేటర్‌కు ‘విదేశీ’ కిక్కు

Alcohol sales of over Rs 400 crore per month in HYD - Sakshi

గ్రేటర్‌లో నెలకు రూ.400 కోట్ల మద్యం అమ్మకాలు

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ పరిధిలో నెలకు సుమారు రూ.400 కోట్ల విలువైన మద్యం అమ్ముడవుతుండగా.. ఇందులో ఏకంగా రూ.75 కోట్లు విదేశీ మద్య మేనని ఆబ్కారీ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తు తం నగరంలో ఉన్న 500 బార్లు, 400 మద్యం దుకాణాల్లో విదేశీ మద్యం లభించేవి దాదాపు 100 వరకు ఉన్నాయి. ప్రధానంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్‌ సిటీ తదితర ప్రాంతాల్లో ఉన్న బార్లలో వినియోగదారుల అభిరుచి మేరకు విదేశీ మద్యం సరఫరా చేస్తున్నారు. ఫారిన్‌ సరుకుకు విని యోగదారుల నుంచి డిమాండ్‌ పెరుగుతుండటంతో పలు బార్ల యజమానులు ఆబ్కారీ శాఖ నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకుంటున్నట్లు నగర ఆబ్కారీ శాఖ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. నగరం లో రోజుకు సుమారు 10 లక్షల లీటర్ల బీరు.. 5 లక్షల లీటర్ల దేశ, విదేశీ రకాల మద్యాన్ని కుమ్మేస్తున్నట్లు ఆబ్కారీశాఖ లెక్కలు చెబుతున్నాయి. రోజువారీ అమ్మకాలతో పోలిస్తే వీకెండ్‌లలో రెట్టింపు స్థాయిలో అమ్మకాలుంటున్నాయని అధికారులు చెబుతున్నారు.  

రూ.లక్షల విలువ చేసే బ్రాండ్లు... 
జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.36లోని ‘టానిక్‌’ బడా లిక్కర్‌ మాల్‌ మందుబాబులను, గ్రేటర్‌ సిటిజన్లు విశేషంగా ఆకర్షిస్తోంది. సుమారు 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ లిక్కర్‌ మాల్‌ ఆసియాలోనే అత్యంత పెద్దది కావడం గమనార్హం. ఇక్కడ నెలకు రూ.5 కోట్ల మేర అమ్మకాలు జరుగుతున్నాయని, ఇందులో సింహభాగం విదేశీ మద్యానిదేనని నిర్వాహకులు తెలిపారు. ఇక బంజారాహిల్స్‌లోని లిక్కర్‌ బ్యాంక్‌లోనూ విదేశీ మద్యం విరివిగా అమ్ముడవుతోంది. నెలకు సుమారు రూ.3 కోట్ల మేర అమ్మకాలు జరుగుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇక్కడ కూడా దేశ, విదేశాలకు చెందిన పలు లిక్కర్‌ బ్రాండ్లు గ్రేటర్‌ సిటిజన్లను ఆకర్షిస్తున్నాయి. జానీవాకర్, చివాస్‌రీగల్‌ వంటి బ్రాండ్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top