మనం వైరస్‌ను తిప్పికొట్టగలం

Aims Scientists study on a type of corona virus - Sakshi

భారతీయుల్లో ఆ సామర్థ్యం ఉంది..

కరోనా వైరస్‌లోని ఓ రకంపై ఎయిమ్స్‌ అధ్యయనం

ఈ వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు నిర్ధారణ

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత అంతకంతకూ పెరుగుతుండటంతో శాస్త్రవేత్తలు సైతం ప్రయోగాలను ముమ్మరం చేశారు. వైరస్‌ జన్యుక్రమంపై ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) సరికొత్త పరిశోధన చేసింది. వైరస్‌ జన్యుక్రమంతో పాటు వైరస్‌ సోకిన వారు దాన్ని ఎదుర్కొంటున్న తీరును అధ్యయనం చేసింది. ఇప్పటివరకు భారత్‌లో వ్యాప్తి చెందిన వైరస్‌లో 7 రకాలు దాదాపు 42 శాతం వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. ఇందులో ఏ2ఏ రకానికి చెందిన ఎం.టి.012098 బెడిప్రెడ్‌ 2.0 సర్వర్, నెట్‌సీటీఎల్‌ 1.2 సర్వర్‌ పద్ధతిలో టి, బి ఆధారిత రోగనిరోధక శక్తిపై ప్రభావాన్ని అంచనా వేశారు. దీన్ని ఎన్‌డీబీఐ జీన్‌బ్యాంక్‌ నుంచి సే కరించారు. డాక్టర్‌ రూబీ ధార్, అకౌరి యాష్‌ సిన్హా సారథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్‌లోని బ యోకెమిస్ట్రీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ విభాగాలు ఈ అధ్యయనం చేశాయి. వైరస్‌ జన్యు విశ్లేషణ, వైరస్‌ స్వభావంపై నివేదిక తయారు చేశాయి. (ఒక్కరోజులో 380 మంది మృతి)

సమర్థంగా పోరాటం..
కరోనా ఏ2ఏ రకం శరీరంలోకి ప్రవేశించిన తర్వాత రెండు, మూడు రోజుల్లో దాని ఉనికిని చూపిస్తుంది. అయితే చాలావరకు వైరస్‌ సోకిన వారిలో లక్షణా లు పెద్దగా కనిపించట్లేదు. ఇందుకు శరీరంలోని వై రస్‌ను ఎదుర్కొనే కణాలు సమర్థంగా పనిచేస్తుండటమే కారణమని చెబుతున్నారు. వైరస్‌లోని 4 రకా ల జీన్స్‌పై, మానవ శరీరంలోని కణాల పనితీరుపై చేసిన పరిశోధనలో ఈ ఫలితాలు గుర్తించారు. నిర్దేశించిన రకం కరోనా వైరస్‌ను మన శరీరం ఎదుర్కొంటూ రోగనిరోధక శక్తిని ప్రేరేపించేలా పనిచేస్తున్నట్లు కనుగొన్నారు. అయితే తాజాగా సీసీఎంబీ చేసిన పరిశోధనలో 1/ఏ3ఐ అనే కొత్త రకం వైరస్‌ ను గుర్తించారు. మన దగ్గర 50 శాతానికిపైగా ఈ ర కం వైరస్‌ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కూడా లోతై న పరిశోధన చేస్తే వ్యాక్సిన్‌ పరిశోధనకు ఉపయోగపడుతుందని నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశా ల అసోసియేట్‌ ప్రొ. డాక్టర్‌ కిరణ్‌ చెప్పారు.  (ప్రతీ అయిదుగురిలో ఒకరికి కోవిడ్ ముప్పు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top