మహబూబ్‌నగర్ జిల్లాలో కల్తీ కల్లు దొరక్క అస్వస్థత పాలైన బాధితుల్లో మరో ముగ్గురు శుక్రవారం మృతి చెందారు.
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లాలో కల్తీ కల్లు దొరక్క అస్వస్థత పాలైన బాధితుల్లో మరో ముగ్గురు శుక్రవారం మృతి చెందారు. వీరంతా జడ్చర్ల మండలానికి చెందిన వారు. మండలంలోని జంగాపూర్ గ్రామానికి చెందిన యాదమ్మ(50) ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. అలాగే, బూరుగుపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య(45) ఇంటివద్దే మృతి చెందగా, చెన్నయ్య(50) మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ ఆస్పత్రిలో కన్నుమూశాడు.