ప్రశాంతంగా అచ్చంపేట పంచాయతీ ఎన్నికలు | achampet nagara panchayat elections will done peacefully | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా అచ్చంపేట పంచాయతీ ఎన్నికలు

Mar 6 2016 8:49 PM | Updated on Sep 3 2017 7:09 PM

మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.

అచ్చంపేట: మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మండు టెండను సైతం లెక్క చేయకుండా ఎండలో నిలుచుని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ దంపతులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

20వార్డులకుగానూ 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 57 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 70.88 శాతం ఓటింగ్ నమోదైంది. అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి 20 మంది, కాంగ్రెస్ 13, టీడీపీ 4, బీజేపీ 3, స్వంతంత్రలు 17 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ టీకే శ్రీదేవి, ఎస్పీ పి.విశ్వప్రసాద్ ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement