
చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే అవకాశం!
ఓటుకు కోట్లు వ్యవహారంపై తెలంగాణ ఏసీబీ తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ : ఓటుకు కోట్లు వ్యవహారంపై తెలంగాణ ఏసీబీ తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో ఆయనకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఉన్నత స్థాయి నుంచి అనుమతి లభించినట్లు తెలుస్తోంది. చట్టప్రకారం అన్ని చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం గవర్నర్ తో సమావేశం అయ్యారు.