ఫుడ్‌ ఇన్‌స్పెక‍్టర్‌ ఇళ‍్లలో ఏసీబీ సోదాలు | ACB Raids On Gazetted Food Inspector bapuji Adilabad | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ ఇన్‌స్పెక‍్టర్‌ ఇళ‍్లలో ఏసీబీ సోదాలు

Aug 23 2017 12:42 PM | Updated on Oct 4 2018 5:08 PM

ఫుడ్‌ ఇన్‌స్పెక‍్టర్‌ ఇళ‍్లలో ఏసీబీ సోదాలు - Sakshi

ఫుడ్‌ ఇన్‌స్పెక‍్టర్‌ ఇళ‍్లలో ఏసీబీ సోదాలు

ఆదిలాబాద్‌ జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ బాపూజీ ఇళ్లలో ఏసీబీ సోదాలు చేసింది.

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ బాపూజీ ఇళ్లలో ఏసీబీ సోదాలు చేసింది. హైదరాబాద్‌లోని సోమాజిగూడ, బండ్లగూడ జాగీర్, మేడ్చల్‌లోని ఇళ్లతో పాటు ఆదిలాబాద్‌లోని ఇల్లు, ఆయన కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు జరిపింది. సోమాజిగూడలోని ఇంట్లో  రూ. 2 లక్షల నగదు, 260 గ్రాముల బంగారం, అర కిలో వెండితో పాటు బండ్లగూడలో రూ.1.50 కోట్ల విలువైన విల్లా, మేడ్చల్‌లో వ్యవసాయ స్థలం, రెండు బ్యాంకుల్లో ఖాతాలతోపాటు ఒక లాకర్‌ను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ పాపలాల్  ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement