'అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాం' | ACB integration TDP Leaders pradeep and pullarao | Sakshi
Sakshi News home page

'అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాం'

Jul 21 2015 5:23 PM | Updated on Aug 17 2018 12:56 PM

ఏసీబీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చామని టీడీపీ నేత ప్రదీప్ చౌదరితోపాటు విద్యార్థి నాయకుడు పుల్లారావు వెల్లడించారు.

హైదరాబాద్: ఏసీబీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చామని టీడీపీ నేత ప్రదీప్ చౌదరితోపాటు విద్యార్థి నాయకుడు పుల్లారావు వెల్లడించారు. ఓటుకు నోటు కేసులో మంగళవారం వారిద్దరిని ఏసీబీ విచారించింది. ఆ విచారణ అనంతరం ప్రదీప్ చౌదరి, పుల్లారావులు విలేకర్లతో మాట్లాడారు. తన ఫోన్ లిస్ట్ ఆధారంగా తనను విచారించారని ప్రదీప్ వివరించారు.

అలాగే పుల్లారావు మాట్లాడుతూ... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకే తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని పుల్లారావు ఆరోపించారు. తనకు జిమ్మిబాబు స్నేహితుడని వివరించారు. వారితో మాట్లాడిన కాల్లిస్ట్ ఆధారంగానే తనను విచారించారని పుల్లారావు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement