ఏసీబీకి చిక్కిన లైన్ ఇన్‌స్పెక్టర్ | ACB Caught Line inspector | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన లైన్ ఇన్‌స్పెక్టర్

Feb 18 2016 4:46 PM | Updated on Sep 18 2018 8:38 PM

పెద్ద అంబర్‌పేట్ విద్యుత్ సబ్ స్టేషన్ లైన్ ఇన్‌స్పెక్టర్ ప్రభులాల్ రూ.13,000 లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కాడు.

పెద్ద అంబర్‌పేట్ (రంగారెడ్డి జిల్లా) : పెద్ద అంబర్‌పేట్ విద్యుత్ సబ్ స్టేషన్ లైన్ ఇన్‌స్పెక్టర్ ప్రభులాల్ రూ.13,000 లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. రిటైర్డ్ ఆర్‌టీసీ ఉద్యోగి అనంతుల రవీందర్.. కుంట్లూర్ సమీపంలో ఉన్న తన అరెకరం పొలంలో కొత్త మీటర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో ప్రభులాల్ లంచం అడగడంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగారెడ్డి, సైబరాబాద్ ఏసీబీ డీఎస్పీ ఎమ్ ప్రభాకర్ బృందం రవీందర్ లంచం ఇస్తుండగా పట్టుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement