గీత కార్మిక సంఘం అధ్యక్షుడి నుంచి లంచం తీసుకుంటూ మంథని ఎక్సైజ్ శామ్యూల్ జాక్సన్ జామ్ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
కరీంనగర్ (మంథని) : గీత కార్మిక సంఘం అధ్యక్షుడి నుంచి లంచం తీసుకుంటూ మంథని ఎక్సైజ్ సీఐ శామ్యూల్ జాక్సన్ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గుర్తింపు కార్డుల జారీ కోసం సీఐ శామ్యూల్ రూ.10 వేలు లంచం అడగటంతో గీత కార్మిక సంఘం వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
మంథని ఎక్సైజ్ ఆఫీసులో సీఐ బాధితుల నుంచి లంచం తీసుకుంటుడగా రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డబ్బు స్వాధీనం చేసుకుని సీఐపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.