ఎస్టీల నుంచి లంబాడీలను తొలగించాలి

Aboriginal Democracy Demands to Remove Lambda from STs - Sakshi

ఆదివాసీ ప్రజాప్రతినిధుల డిమాండ్‌

సాక్షి, ఆసిఫాబాద్‌: ఎస్టీల జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని ఆదివాసీ ప్రజాప్రతినిధులు కుమురం భీం వర్ధంతి సందర్భంగా ముక్త కంఠంతో డిమాండ్‌ చేశారు. ఆదివాసీల న్యాయమైన పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించి సమస్యను పరిష్కరించాలని కోరారు. కుమురం భీం జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో ఆదివారం ఆదివాసీ పోరాట యోధుడు కుమురం భీం 79వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు జోగు రామన్న, ఆత్రం సక్కు, కుమురం భీం జెడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఆదిలాబాద్‌ జెడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్, మాజీ ఎంపీ గొడెం నగేశ్, జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు, ఉట్నూర్‌ ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య, కుమురం భీం మనవడు సోనే రావు, 9 ఆదివాసీ తెగల నేతలు హాజరయ్యారు. ముందుగా భీం స్మారకం, సమాధి వద్ద ఆదివాసీ  డప్పు చప్పుల మధ్య పూజలు చేసి నివాళులర్పించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top