బోగస్ ఓట్లను ఏరివేయూలనే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్‌కార్డును అనుసంధానం
	ఓటర్ కార్డుకు ఆధార్ లింక్   మొదటి స్థానంలో డోర్నకల్..  
	 చివరి స్థానంలో వరంగల్ పశ్చిమ  మార్చి 15న ప్రారంభమైన ప్రక్రియ
	ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో  అనుసంధానం
	 
	పోచమ్మమైదాన్ :  బోగస్ ఓట్లను ఏరివేయూలనే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్‌కార్డును అనుసంధానం చేసింది. జిల్లాలో మార్చి 15న ప్రారంభమై.. జూలై చివరి వరకు పూర్తికావాలని గడువు విధించారు. అనంతరం మళ్లీ ఆగస్టు 15 వరకు  పొడిగించారు. అనుసంధాన ప్రక్రియలో డోర్నకల్ నియోజకవర్గం మొదటిస్థానంలో ఉండగా, చివరి స్థానంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఉంది. కాగా, ఒకరికి రెండు నుంచి మూడు చోట్ల ఓటు హక్కు ఉన్నవారిని గుర్తించేందుకు ఆధార్ కార్డుతో లింక్ పెట్టారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు.
	
	 ఫస్ట్ డోర్నకల్
	 ఈ నెల 13 వ తేదీ వరకు ఓటు హక్కుకు ఆధార్ లింక్ చేయడంలో డోర్నకల్ ప్రథమ స్థానంలో నిలిచింది. డోర్నకల్ నియోజకవర్గంలో 1,70,890 మంది ఓటర్లు ఉండగా అందులో 1,70,833 మంది ఓటర్లను ఆధార్ కార్డుకు అనుసంధానం చేశారు. మిగతా 57 ఓటర్లలో బీఎల్‌ఓలు పరిశీలించగా డూప్లికేట్‌వి 9, మరణించిన వారివి 3, షిఫ్ట్ అయినవి 39, డోర్ లాక్ ఉన్నవి 4, ఎన్‌రోల్ చేసుకోనివి 2 ఉన్నాయి. 100 శాతం డోర్నకల్ నియోజకవర్గం ఓటర్ కార్డు ఆధార్ కార్డు అనుసంధానం పూర్తయింది. చివరన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఉంది. 2,45,335 మంది ఒటర్లు ఉండగా 1,00,901 ఓటర్లు మాత్రమే ఓటరు కార్డుకు ఆధార్ కార్డును అనుసంధానం అయింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో భారీగా తగ్గనున్న ఓటర్ల సంఖ్య. పశ్చిమ నియోజకవర్గంలో బీఎల్‌ఓ ద్వారా ఇంటింటికి సర్వే నిర్వహించారు. ఇంక ఆధార్ లింక్ కాని 1,44,434 ఓటర్ల ఇంటింటికి తిరిగి బీఎల్‌ఓ విచారణ చేపట్టగా 3,049 ఓట్లు డుప్లికేట్‌విగా, ఎలిజిబుల్ కానీ వారు 983, మరణించిన వారు 1,974, షిఫ్ట్ అయిన వారు 30,579, డోర్ లాక్ ఉన్నవి 1,00,004, ఎన్‌రోల్ చేసుకోని వారు 3,269, ఇంక ఎన్‌రోల్ చేయాల్సినవి 4,576 ఉన్నాయి. జిల్లాలో 24,44,989 మంది ఓటర్లు ఉండగా 19,95,749 మంది ఓటరు కార్డుకు ఆధార్ కార్డును అనుసంధానం చేశారు.
	
	 ఆధార్ అనుసంధానంకు అందరూ సహకరించాలి
	 రవీందర్, తహసీల్దార్, వరంగల్.
	 ఆధార్ ఆనుసంధానంకు ప్రతీ ఒక్క ఓటరూ సహకరించాలి. తమ వద్దకు వచ్చే బీఎల్‌ఓలకు ఆధార్ కార్డుల నంబర్లు అందజేయాలి. ఇలా చేయడం వలన డబుల్ ఉన్న ఓటర్లు తొలగించబడుతారు. దీంతో బోగస్ ఓటర్లు పూర్తి స్థాయిలో తొలగించబడుతారు.
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
