వ్యక్తి దారుణ హత్య | a person dangerously murded by unknown people in karimnagar distitict | Sakshi
Sakshi News home page

వ్యక్తి దారుణ హత్య

Feb 6 2015 6:40 PM | Updated on Sep 2 2017 8:54 PM

హైదరాబాద్ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

కరీంనగర్: హైదరాబాద్ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గణేష్‌నగర్‌లో జరిగింది. కాలనీకి చెందిన పడమటింటి భాస్కర్ (32) గురువారం రాత్రి హత్యకు గురయ్యాడు. పెళ్లి సంబంధం కోసం వివరాలు తీసుకురమ్మని స్నేహితుడు ఫోన్ చేయడంతో ఇంటి నుంచి బయలుదేరిన బాస్కర్ శుక్రవారం ఉదయం శవమై కనిపించాడు.

అలకాపురి వద్ద గుర్తుతెలియని దుండగులు అతన్ని కత్తులతో పొడిచి ఆపై బండరాయితో మోది అతి కిరాతకంగా చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement