గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి | A man died in a road accident | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Jun 13 2015 8:49 AM | Updated on Aug 30 2018 3:56 PM

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి - Sakshi

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

జగద్గిరిగుట్ట: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున నగరంలోని ఐడీపీఎల్ చౌరస్తా వద్ద జరిగింది. వివరాలు.. జగద్గిరిగుట్ట పాపిరెడ్డినగర్‌కు చెందిన సాంబశివరావు (50) బాలానగర్‌లోని ఉషా ఫ్యాన్ల కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం విధులకు నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి వాహనం వివరాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement