గుండెపోటుతో వ్యక్తి మృతి | A man died due to heart attack | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో వ్యక్తి మృతి

Mar 12 2015 4:57 PM | Updated on Sep 2 2017 10:43 PM

ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో వాహనం పైనుంచి కిందపడి మృతిచెందాడు.

హైదరాబాద్ క్రైం : ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో వాహనం పైనుంచి కిందపడి మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని అల్వాల్ మెయిన్ రోడ్డులో గురువారం ఉదయం చోటుచేసుకుంది. సుభాష్‌నగర్‌కు చెందిన రాజు (35) బైక్‌పై వెళ్తుండగా హార్ట్‌ఎటాక్ రావడంతో బైక్ పై నుంచి కిందపడ్డాడు. గుండెపోటుతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. పూర్తి వివరాలు తెలియరాలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement