‘గ్రానైట్’ సమస్యలపై మంత్రికి వినతిపత్రం | a document request on granite issues | Sakshi
Sakshi News home page

‘గ్రానైట్’ సమస్యలపై మంత్రికి వినతిపత్రం

Aug 24 2014 2:28 AM | Updated on Sep 2 2017 12:20 PM

‘గ్రానైట్’ సమస్యలపై మంత్రికి వినతిపత్రం

‘గ్రానైట్’ సమస్యలపై మంత్రికి వినతిపత్రం

గ్రానైట్ పరిశ్రమల సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రానైట్ అసోసియేషన్ నాయకులు మంత్రి హరీష్‌రావుకు శనివారం వినతిపత్రమిచ్చారు.

సాక్షి, ఖమ్మం: గ్రానైట్ పరిశ్రమల సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రానైట్ అసోసియేషన్ నాయకులు మంత్రి హరీష్‌రావుకు శనివా రం వినతిపత్రమిచ్చారు. వరంగల్, కరీంనగర్ తదితర జిల్లాలతోపాటు జిల్లాకు చెందిన అసోసియేషన్ నాయకులు మంత్రికి తమ సమస్యలను విన్నవిం చారు.
 
మైనింగ్ రాయల్టీని తగ్గించాలని, పెండిం గులో ఉన్న క్వారీల లీజులకు వెంటనే నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, పెండిం గులోగల సబ్సిడీలను విడుదల చేయాలని, సేల్స్ ట్యాక్స్‌ను 14.5శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించాలని కోరారు. కరెంటు కొరతతో గ్రానైట్ పరిశ్రమ నడిచే పరిస్థితి లేదని చెప్పారు. ఇచ్చే సరఫరాలోనూ అంతరాయం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మంత్రిని కలిసిన వారిలో గ్రానైట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సాధు రమేష్‌రెడ్డి, నాయకులు రాయల నాగేశ్వరరావు, గాయత్రి రవి, యలమద్ది శ్రీనివాసరావు, పారా నాగేశ్వరరావు, పుసులూరి సురేష్‌కుమార్, వేముల రవికుమార్, శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement