ప్రాణం తీసిన ఈత సరదా | A boy died through swimming | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఈత సరదా

May 9 2015 12:55 AM | Updated on Sep 3 2017 1:40 AM

ప్రాణం తీసిన ఈత సరదా

ప్రాణం తీసిన ఈత సరదా

ఈత సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది...

- బావిలో మునిగి బాలుడి మృతి
- సూర్యాపేటలో ఘటన
- మృతుడు హైదరాబాద్ వాసి
- సూర్యాపేట మున్సిపాలిటీ

ఈత సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. ఈ ఘటన సూర్యాపేట పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. మృతుడి బంధువులు, పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని రామచంద్రాపురం కాలనీకి చెం దిన శాస్త్రీ చంద్రం-రజిత దంపతులు పిల్లలతో కలిసి తన స్నేహితుడు సుతారపు సోమనర్సయ్య కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఈ నెల 5వ తేదీన సూర్యాపేట పట్టణంలోని మామిళ్లగడ్డకు వచ్చారు. 6వ తేదీన వివాహ వేడుకలో పాల్గొన్నారు.

గురువారమే హైదరాబాద్ వెళ్లాల్సి ఉండగా బస్సులు నడవకపోవడంతో సూర్యాపేటలోనే ఆగిపోయారు. కాగా, శుక్రవారం ఉద యం చంద్రం కుమారుడు భానుప్రసాద్(14) తన స్నేహితులతో కలిసి ఇంది రమ్మ కాలనీలో గల బాపనబావి వద్దకు వెళ్లాడు. మిగతా స్నేహితులు ఈత కొ డుతుండడాన్ని చూసి భానుప్రసాద్ కూ డా బావిలోకి దిగాడు. అతడికి ఈత రా కపోవడంతో బావి నీటిలో మునిగి మృతిచెందాడు. భానుప్రసాద్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కుమారుడు మృతిచెందాడన్న విషయం తెలుసుకుని తల్లిద్రండులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. మృతుడి తండ్రి  చంద్రం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement