
ఫారంలో మృతిచెందిన కోళ్లు
దామరగిద్ద (నారాయణపేట): వడగడ్ల వర్షానికి నాటుకోళ్ల ఫారంలో 950 కోళ్లు మృతిచెందాయి. ఈ సంఘటన మండలంలోని బొమ్మన్‌పాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు బడేసాబ్ గత రెండు నెలల కిత్రం రూ.లక్ష వెచ్చించి సుమారు 1,500 నాటుకోళ్లను పెంచాడు.
కాగా ఇటీవల కురిసిన వడగళ్ల వానకు కోళ్ల ఆరోగ్యం దెబ్బతిని బుధవారం వరకు సుమారు 950 కోళ్లు మృతిచెందాయి. ఉపాధి కోసం పెంచిన కోళ్లు మృతిచెందడంతో ఆర్థికంగా నష్టపోయాడు. బడేసాబ్‌కు ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని సర్పంచ్ సాయమ్మ, ఎంపీటీసీ అనంతమ్మ, నాయకులు భగవంతు, శేఖర్ కోరారు.