breaking news
chikens
-
పౌల్ట్రీఫాంపై పిడుగు.. 500 కోళ్లు మృతి
షాబాద్(చేవెళ్ల : పిడుగు పడి బాయిలర్ కోళ్లు మృ తిచెందిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపుల తో కూడిన వర్షంలో పిడుగుపడి బాయిలర్ కోళ్లు మృతిచెందిన ఘటన షాబాద్ మండల పరిధిలోని నరెడ్లగూడలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపి న వివరాల ప్రకారం... మండల పరిధిలోని నరెడ్లగూడ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల చంద్రలింగం పౌల్ట్రీఫామ్‌లో పిడుగుపాటుకు గురై సుమారు 500 వరకు కోళ్లు మృతి చెందాయి. తమను ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అప్పులు చేసి కోళ్ల పరిశ్రమను నడిపిస్తున్న తమకు పిడుగు రూపాన తీరని నష్టం ఏర్పడిందని వాపోతున్నారు. పిడుగుపాటుకు గురై ముగ్గురు మహిళలకు గాయాలు... పిడుగుపడి ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలైన సంఘటన షాబాద్ మండల పిరిధిలోని ఆస్పల్లిగూడ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...ఆస్పల్లిగూడ గ్రామానికి చెందిన రైతు పొలంలో గురువారం రాత్రి అదే గ్రామానికి చెందిన కొందరు మహిళలు కూలీ పనులు చేస్తుండగా సాయంత్రం ఈదులు గాలులు, వర్షం కురవడంతో వారంతా పక్కనే ఉన్న చెట్టు కిందికి వెళ్లారు. అంతలోనే ఉరుములు రావడంతో చెట్టుపై పిడుగు పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన యాదమ్మ, మౌనిక, రాములమ్మలను షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సలు నిర్వహించారు. -
బొమ్మన్‌పాడ్‌లో 950 నాటుకోళ్ల మృత్యువాత
దామరగిద్ద (నారాయణపేట): వడగడ్ల వర్షానికి నాటుకోళ్ల ఫారంలో 950 కోళ్లు మృతిచెందాయి. ఈ సంఘటన మండలంలోని బొమ్మన్‌పాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు బడేసాబ్ గత రెండు నెలల కిత్రం రూ.లక్ష వెచ్చించి సుమారు 1,500 నాటుకోళ్లను పెంచాడు. కాగా ఇటీవల కురిసిన వడగళ్ల వానకు కోళ్ల ఆరోగ్యం దెబ్బతిని బుధవారం వరకు సుమారు 950 కోళ్లు మృతిచెందాయి. ఉపాధి కోసం పెంచిన కోళ్లు మృతిచెందడంతో ఆర్థికంగా నష్టపోయాడు. బడేసాబ్‌కు ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని సర్పంచ్ సాయమ్మ, ఎంపీటీసీ అనంతమ్మ, నాయకులు భగవంతు, శేఖర్ కోరారు. -
లక్షన్నర కోళ్లను చంపేశారు
చికెన్ కొనుగోలును నిలిపివేసిన మైసూరు జూ అధికారులు కొన్ని జాగ్రత్తలతో బర్డ్‌ఫ్లూ దూరం : నిపుణులు బెంగళూరు : రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ నివారణా చర్యలు యుద్ధ ప్రతిపాదికన సాగుతున్నాయి. అందులో భాగంగా బర్డ్‌ఫ్లూ సోకిన పక్షులను నిపుణులు బృందం వైజ్ఞానికంగా సంహరిస్తోంది. రాష్ట్రంలోని బీదర్ జిల్లా హొమ్నాబాద్ తాలూకా మార్కెర గ్రామంలో బర్డ్‌ఫ్లూతో 20 వేల కోళ్లు చనిపోగా అక్కడే వివిధ కోళ్ల ఫారంలలో ఉన్న మరో 1.50 లక్షల కోళ్లను చంపడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పశుసంవర్థకశాఖ అధికారులు 50 బృందాలను ఏర్పాటు చేసి బర్డ్‌ఫ్లూ సోకిన కోళ్లను మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ చంపేశారు. ఇందు కోసం నాలుగు వేల సంచులను సిద్ధం చేసుకుని 200 గుంతలను తవ్వారు. ఒక్కొక్క సంచిలో నలభై నుంచి యాభై కోళ్లను వేసి అటుపై గుంతల్లో వేసి మట్టితో కప్పేశారు. ఈ పనిలో నిమగ్నమైన వారికి మాస్క్‌లు, ప్రత్యేక దుస్తులను అందజేశారు. కాగా, పక్షలను వైజ్ఞానికంగా చంపే కార్యక్రమం సోమవారమే జరగాల్సి ఉండగా వర్షం వ ల్ల ఈ పనిని మంగళవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా బర్డ్‌ఫ్లూ విషయమై ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేయడంతో రాష్ట్రంలోని వివిధ జూ సిబ్బంది అక్కడి జంతువులకు కోళ్లను ఆహారంగా వేయడాన్ని నిలిపివేశాయి. అంతేకాకుండా పక్షులు ఉన్న ఎన్‌క్లోజర్స్‌ను పూర్తిగా శుభ్రం చేసి వాటి శ్యాంపిల్స్‌ను కూడా పరీక్ష కోసం లాబొరేటరీలకు పంపించారు. ఈ విషయమై మైసూరు జూ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్.వెంకటేషన్ మాట్లాడుతూ...‘మా జూలో బర్డ్‌ఫ్లూ సోకిన దాఖలాలు ఏవీ కనబడలేదు. అయినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చికెన్ కొనుగోలును నిలిపివేశాం.’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పక్షుల ద్వారా మనుషులకు కూడా బర్డ్‌ఫ్లూ (ఏవీఎన్ ఇన్ఫ్లూఎంజా-ఎచ్5ఎన్1) వ్యాధి సోకే అవకాశం ఉంది. దీంతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చునని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో ప్రజలకు ఎవరికీ కూడా బర్డ్‌ఫ్లూ సోసిన దాఖలాలు లేవు. కాగా, బర్డ్‌ఫ్లూ సోకిన వారికి ప్రస్తుతం ఓసల్టామీవీర్ (టామీఫ్లూ) మందును అందజేస్తున్నారు. దీంతో పాటు జనామీవీర్ను కూడా కొన్నిచోట్ల బర్డ్‌ఫ్లూ వ్యాధి చికిత్సలో అందజేయవచ్చు. పక్షుల్లో బర్డ్‌ఫ్లూ లక్షణాలు ఇవి.. అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో పక్షులు చనిపోవడం పక్షుల్లో విసర్జక పదార్థాలు సాధారణం కంటే నీళ్లగా ఉండడం పక్షుల కాళ్లు, ముక్కు ఊదా రంగులోకి మారి పోవడం పక్షుల గుడ్డు పెంకులు పెలుసుగా మారిపోవడం పక్షులు ఆహారాన్ని తీసుకోవపోవడం కనురెప్పలు, తల, కాళ్ల గోళ్లు ఉబ్బిపోవడం ముక్కుల నుంచి నీరు కారడం మనుషుల్లో బర్డ్‌ఫ్లూ లక్షణాలు ఇవి... శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, దగ్గు, ముక్కు నుంచి నీరు కారడం స్వల్ప పరిమాణంలో శరీర ఉష్ణోగ్రత పెరగడం చాలా కొంతమందిలో శరీరంపై దద్దుర్లు కూడా వస్తాయి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి... బర్డ్‌ఫ్లూ ఉన్న పరిసర ప్రాంతాల్లో కోడి మాంసంతో పాటు గుడ్డును పూర్తిగా ఉండికించిన తర్వాతనే తినాలి హాఫ్ బాయిల్డ్, స్మోక్డ్ చికెన్లను తినకపోవడం మంచిది కోళ్లను ముట్టుకున్న తర్వాత చేతిని సోపుతో శుభ్రపరుచుకోవాలి కోళ్ల వ్యర్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చేతితో తాకకూడదు