తగ్గినట్లే తగ్గి..

82 Coronavirus Positive Cases file in Hyderabad - Sakshi

మళ్లీ విజృంభిస్తున్న కరోనా

నాదర్‌గూల్, మీర్‌పేట్,బడంగ్‌పేట్, లెనిన్‌నగర్‌లో కొత్త కేసులు

శుక్రవారం గ్రేటర్‌లో 82 పాజిటివ్‌ కేసులు

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని పాత కంటైన్మెంట్ల పరిధిలో కరోనా కేసుల తీవ్రత తగ్గినప్పటికీ...ప్రస్తుతం రోజుకో కొత్త ప్రాంతంలో వైరస్‌ వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగి స్తోంది. వీటికి మూలాలు కూడా దొరకడం లేదు. దీనికితోడు వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ వచ్చిన బాధితుల్లో 80 శాతం మందిలో వైరస్‌ లక్షణాలు కనిపించక పోవడంతో కుటుంబ సభ్యుల్లో ఎవరికి వైరస్‌ ఉందో? ఎవరికి లేదో? గుర్తించడం కష్టంగా మారింది.కాగా శుక్రవారం రికార్డు స్థాయిలో 82 పాజిటివ్‌ కేసులు వెలుగులోకి రావడం సిటీజనులను కలవరపెడుతోంది.

కింగ్‌కోఠిలో 11 మందికి పాజిటివ్‌:
కింగ్‌కోఠి ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో ఉన్న 11 మందికి పాజిటివ్‌ వచ్చింది. నెగిటివ్‌ వచ్చిన మరో 10 మందిని డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 153 మంది అనుమానితులు ఉన్నారు. వీరిలో మరో 17 మంది రిపోర్టులు రావాల్సి ఉంది.  నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో కొత్తగా మరో 17 మంది అనుమానితులు రాగా, వైద్యులు వారిని ఐసోలేషన్‌ వార్డులో అడ్మిట్‌ చేశారు. స్వాబ్స్‌ సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపుతున్నారు. ఇక ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రి సహా ఆయుర్వేద ఆస్పత్రులు ఖాళీ అయ్యాయి. 

పహాడీషరీఫ్‌లో మరో ఆరుగురికి..
పహాడీషరీఫ్‌: పహాడీషరీఫ్‌ గ్రామంలో శుక్రవారం మరో ఆరుగురు వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. దీంతో  గ్రామంలో కరోనా బాధితుల కేసుల సంఖ్య 28కి చేరింది. మటన్‌ వ్యాపారి బంధువుల ద్వారా ఈ నెల 26న 14 మందికి పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. వారితో ప్రైమరీ కాంటాక్ట్‌గా ఉన్న 35 మందికి పరీక్షలు నిర్వహించగా మరో 14 మందికి పాజిటివ్‌గా తేలింది. వారితో సెకండరీ కాంటాక్ట్‌గా ఉన్న 45 మందిని హోం క్వారంటైన్‌ చేశారు. 

ఒకే కుటుంబంలో నలుగురికి..
జూబ్లీహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని ఎమ్మెల్యే కాలనీలో కరోనా కలకలం రేపింది. ఒకే కుటుంబంలో నలుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ అధికారులు శుక్రవారం కాలనీలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. వివరాల్లోకి వెళితే ఎమ్మెల్యే కాలనీలోని వీ6 వీధిలో ఉంటున్న ఓ కుటుంబ సభ్యులు పది రోజుల క్రితం కొంపల్లిలో ఉంటున్న తమ బంధువు మృతి చెందడంతో అక్కడికి వెళ్లి వచ్చారు. మూడు రోజుల క్రితం కుటుంబంలోని యువకుడి(17)కరోనా లక్షణాలు కనిపించడంతో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాజిటివ్‌గా నిర్ధారించారు. దీంతో అతడి కుటుంబంలోని మిగతా ముగ్గురిని కూడా పరీక్షించగా వారికి కూడా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారిని అదే ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 

కుద్భిగూడలో ఒకరికి...
కాచిగూడ: కుద్భిగూడలో ఓ వ్యక్తి(57)కి శుక్రవారం కరోనా పాజిటివ్‌ రావడంతో అతడిని గాంధీ అసుపత్రికి తరలించిన అతడి ఇంటిని క్వారంటైన్‌ చేశారు.  

రిసాల అబ్దుల్లా ప్రాంతంలో మహిళకు..
అఫ్జల్‌గంజ్‌: అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రిసాల అబ్దుల్లా ప్రాంతానికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో శుక్రవారం ఆమెను గాంధీ ఆసుపత్రికి         తరలించారు.

బడంగ్‌పేటలో ఇద్దరు బాలురకు..
బడంగ్‌పేట: బడంగ్‌పేట కార్పోరేషన్‌ పరిధిలోని సాయి బాలాజీ కాలనీలో ఇద్దరు బాలురకు కరోనా పాజిటివ్‌ రావడంతో అధికారులు వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.  

మీర్‌పేటలో మహిళకు..
మీర్‌పేట: మీర్‌పేట కార్పొరేషన్‌ పరిధిలోని లెనిన్‌నగర్‌కు చెందిన మహిళ ఈ నెల 18న ప్రసవం కోసం  ఇంజాపూర్‌లోని పుట్టింటికి వెళ్లింది. డెలివరీ అనంతరం  పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు మీర్‌పేట కమిషనర్‌ సుమన్‌రావు తెలిపారు. దీంతో ఆమె భర్త, అత్తలను హోం క్వారంటైన్‌ చేసినట్లు తెలిపారు.

ఓల్డ్‌ బోయిన్‌పల్లిలో ఒకరికి..
ఓల్డ్‌బోయిన్‌పల్లి: ఓల్డ్‌ బోయిన్‌పల్లి డివిజన్‌ భవానీనగర్‌కు చెందిన  వ్యక్తికి శుక్రవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అనారోగ్యంతో బాధపడుతున్న అతను గత కొన్ని రోజులుగా అసుపత్రుల చుట్టూ తిరిగాడు. రెండు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్న అతను గాంధీలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. అతడి కుటుంబ సభ్యులు ముగ్గురిని హోం క్వారంటైన్‌లో ఉంచారు.  

ఎంఎస్‌మక్తాలో వృద్ధురాలికి..
ఖైరతాబాద్‌: ఖైరతాబాద్‌ డివిజన్, ఎంఎస్‌మక్తాలో ఓ వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఎంఎస్‌మక్తాలో ఉంటున్న వృద్ధురాలు(60) అనారోగ్యంతో బాధపడుతూ సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. దీంతో శుక్రవారం ఆమె కుటుంబసభ్యులను నేచర్‌ క్యూర్‌ హాస్పిటల్‌కు తరలించారు. 

‘గాంధీకుటీర్‌’లో యువకుడికి...
హిమాయత్‌నగర్‌: నారాయణగూడ, గాంధీకుటీర్‌ బస్తీకి చెందిన యువకుడికి శుక్రవారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మెదక్‌ జిల్లాకు చెందిన ఇతను మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ నెల 28న ఫీవర్‌ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. అతడికి పాజిటివ్‌ రావడంతో శుక్రవారం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా అతడితో పాటు పని చేస్తున్న మరో ఎనిమిది మంది కోసం అధికారులు గాలింపు చేపట్టారు.

యూసుఫ్‌గూడలో మరో నలుగురికి..
వెంగళరావునగర్‌: యూసుఫ్‌గూడ సర్కిల్‌–19 పరిధిలో శుక్రవారం నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కల్లు కాంపౌండ్‌ గల్లీలో 11 ఏళ్ల చిన్నారి, వీడియోగల్లీలో ఓ కానిస్టేబుల్‌ కరోనా బారిన పడ్డారు. వెంకటగిరిలో ఉంటూ అఫ్జల్‌గంజ్‌ ప్రాంతంలో పని చేస్తున్న మరో కానిస్టేబుల్, ఇంజినీర్స్‌ కాలనీలో నివసిస్తున్న వైద్యుడికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

14-07-2020
Jul 14, 2020, 03:29 IST
వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో రికార్డు స్థాయిలో అత్యధికంగా 2,30,000 కోవిడ్‌ కేసులు...
14-07-2020
Jul 14, 2020, 02:59 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా మరో 1,550 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌–19 కేసుల...
14-07-2020
Jul 14, 2020, 02:50 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘కరోనా విషయంలో సీఎం కేసీఆర్‌ విఫల మయ్యారని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. కొన్ని పత్రికలూ అదే రాస్తున్నాయి....
14-07-2020
Jul 14, 2020, 02:43 IST
అతను జనగాం జిల్లా వైద్యాధికారుల్లో కీలక స్థానంలో ఉన్నాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని తన సొంత క్లినిక్‌లో రాత్రివేళ కరోనా లక్షణాలున్న...
14-07-2020
Jul 14, 2020, 01:57 IST
న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 43వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎమ్‌) రేపు (బుధవారం) జరగనున్నది. కరోనా వైరస్‌ కల్లోలం నేపథ్యంలో...
13-07-2020
Jul 13, 2020, 20:47 IST
చెన్నై :  దేశంలోనే అత్య‌ధిక క‌రోనా ప్ర‌భావిత రాష్ర్టాల్లో త‌మిళ‌నాడు ఒక‌టి. ఈ నేప‌థ్యంలో క‌రోనా క‌ట్ట‌డి దృష్ట్యా లాక్‌డౌన్‌ను...
13-07-2020
Jul 13, 2020, 20:05 IST
చండీగ‌ఢ్: క‌రోనా క‌ట్ట‌డికి మ‌రింత క‌ఠినంగా ఆంక్ష‌లను విధిస్తూ సోమ‌వారం పంజాబ్ స‌ర్కార్ కీల‌క  నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే బ‌హిరంగ...
13-07-2020
Jul 13, 2020, 17:51 IST
సింగ‌పూర్: కోవిడ్ వ్యాప్తి క‌ట్ట‌డి కోసం సింగ‌పూర్ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలో ఏ ఒక్క‌రు కోవిడ్ నిబంధ‌న‌ల(స‌ర్క్యూట్ బ్రేక‌ర్‌)‌ను...
13-07-2020
Jul 13, 2020, 15:48 IST
పారీస్‌: కరోనా వైరస్‌ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. వైరస్‌ కట్టడి కోసం దేశాలన్ని లాక్‌డౌన్‌ విధించడంతో ఆర్థికంగా ఇప్పటికే ఎంతో నష్టాన్ని...
13-07-2020
Jul 13, 2020, 15:30 IST
కోల్‌క‌తా :  త‌న భార్య‌కు క‌రోనా సోకింద‌ని భార‌త మాజీ ఆల్ రౌండ‌ర్, మంత్రి లక్ష్మీ రతన్ శుక్లా వెల్ల‌డించారు....
13-07-2020
Jul 13, 2020, 14:39 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ సంక్షోభం ప్రపంచంతోపాటు భారత ఆర్థికవ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వివిధ...
13-07-2020
Jul 13, 2020, 14:04 IST
ప‌ట్నా: ఏమాత్రం అజాగ్ర‌త్తప‌డ్డా మ‌నుషుల్ని పీడించేందుకు క‌రోనా ర‌క్క‌సి సిద్ధంగా ఉంటుంది. చిన్న‌పాటి నిర్ల‌క్ష్యం కూడా క‌రోనాకు మ‌రింత చేరువ...
13-07-2020
Jul 13, 2020, 13:16 IST
సాక్షి, ముంబై : విలక్షణ నటుడు సోనూ సూద్‌ (46) మరోసారి తనగొప్ప మనసు చాటుకున్నారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌...
13-07-2020
Jul 13, 2020, 13:03 IST
బెంగళూరు: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ రోజు రోజుకు విజృంభిస్తోంది. సామాన్యులతో పాటు ప్రజా ప్రతినిధులను కూడా వదలడం లేదు....
13-07-2020
Jul 13, 2020, 12:24 IST
కోవిడ్‌ కారణంగా వీధి వ్యాపారుల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది..రెక్కాడితే గానీ డొక్కాడని వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం జగనన్న తోడు...
13-07-2020
Jul 13, 2020, 11:47 IST
జైపూర్‌: ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వానికి ఝలక్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ యువ నాయకుడు, ఉపముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌ సచిన్‌ పైలట్‌...
13-07-2020
Jul 13, 2020, 09:35 IST
కరోనా జిల్లా వాసులను కలవరపెడుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది.కరోనా నియంత్రణ విధులు నిర్వహించే పోలీస్‌ విభాగంలోనూ కలకలం సృష్టిస్తోంది....
13-07-2020
Jul 13, 2020, 07:34 IST
సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరంపై కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గత నాలుగు నెలలతో పోలిస్తే.. ప్రస్తుతం వైరస్‌ రాకెట్‌ వేగంతో విస్తరిస్తోంది....
13-07-2020
Jul 13, 2020, 06:59 IST
ధారూరు: ధారూరుకు కరోనా ముప్పు పొంచి ఉందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మండలంలో ఈ రోజు వరకు ఒక్క...
13-07-2020
Jul 13, 2020, 04:22 IST
ముంబై : వాళ్లంతా నిరుపేదలు, రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. కిక్కిరిసినట్లుండే జనం. 10 లక్షల మంది జనాభాతో ఆసియా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top