ముగిసిన ఎన్నికల కోడ్‌

With 79 days of code being implemented new development - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌ సభతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును ఎత్తివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అజయ్‌ కుమార్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమలుకు తెరపడటంతో కొత్త అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునేందుకు అడ్డంకి తొలగింది. మార్చి 10న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నాటి నుంచి ఆదివారం వరకు 79 రోజుల పాటు కోడ్‌ అమల్లోకి ఉండటంతో కొత్త అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు కుంటుపడింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top