70 ఏళ్ల వృద్దురాలిపై గ్యాంగ్ రేప్ | 70 years old woman gangrape in vikarabad | Sakshi
Sakshi News home page

70 ఏళ్ల వృద్దురాలిపై గ్యాంగ్ రేప్

Aug 21 2014 12:13 PM | Updated on Mar 28 2018 11:08 AM

70 ఏళ్ల వృద్దురాలిపై గ్యాంగ్ రేప్ - Sakshi

70 ఏళ్ల వృద్దురాలిపై గ్యాంగ్ రేప్

రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో 70 ఏళ్ల వృద్దురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు గురువారం వెల్లడించారు.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో 70 ఏళ్ల వృద్దురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. మరో నలుగురు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం... గత అర్థరాత్రి వికారాబాద్లో రాజీవ్ గృహకల్ప సముదాయంలో వృద్దురాలిపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం నిందితులు పరారు అయ్యారు.

బాధితురాలు స్థానికుల సహాయంతో పోలీసులను ఆశ్రయించి... ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు... తమదైన శైలిలో నిందితుడ్ని విచారిస్తున్నారు. మిగిత నిందితులను కూడా సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement