బాలికను గర్భవతి చేసిన 70ఏళ్ల వృద్ధుడు | 70 Years Old Man Molestation On Minor Girl In Medak | Sakshi
Sakshi News home page

14ఏళ్ల బాలికపై 70ఏళ్ల వృద్ధుడి అత్యాచారం

May 22 2020 7:04 PM | Updated on May 22 2020 8:31 PM

70 Years Old Man Molestation On Minor Girl In Medak - Sakshi

సాక్షి, పటాన్‌చెరు : ఇంట్లో పని చేస్తున్న ఓ బాలికపై ఆరు నెలలుగా 70ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ బాలిక మూడు నెలల గర్భవతి కావటంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాలిక తండ్రి కథనం ప్రకారం.. మెదక్‌ జిల్లా నత్నాయిపల్లి గ్రామానికి చెందిన రుద్రయ్య తన కుటుంబ సభ్యులతో  జిన్నారం మండలం కిష్టాయిపల్లి గ్రామానికి 12ఏళ్ల క్రితం వచ్చారు. రుద్రయ్యకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. 14ఏళ్ల కుమార్తె అదే గ్రామంలో నివాసం ఉంటున్న సుమారు 70ఏళ్ల బషెట్టిగారి దయానంద్‌ ఇంట్లో పని చేస్తోంది.

బషెట్టిగారి దయానంద్‌ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను బెదిరిస్తూ అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పేందుకు భయపడింది. ఆరు నెలల నుంచి అత్యాచారం జరుగుతుంది. వారం రోజుల నుంచి బాలికకు తీవ్రమైన వాంతులు, కడుపునొప్పి వస్తుండటంతో ఆస్పత్రిలో వైద్యులకు చూపించారు. దీంతో మూడు నెలల గర్భవతి అని చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. ఈ విషయమై బాలిక తండ్రి రుద్రయ్య బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు జరుపుతున్నామని సీఐ ప్రశాంత్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement