ఏడు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులు | 7 districts to face gusty winds on wednesday, reports IMD | Sakshi
Sakshi News home page

ఏడు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులు

Apr 26 2017 3:01 AM | Updated on Sep 5 2017 9:40 AM

రాష్ట్రంలో కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌కర్నూలు, వనపర్తి, జగిత్యాల జిల్లాల్లో బుధవారం కొన్ని చోట్ల ఉరుములతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌కర్నూలు, వనపర్తి, జగిత్యాల జిల్లాల్లో బుధవారం కొన్ని చోట్ల ఉరుములతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరికొన్ని చోట్ల సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేరకు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. చాలా ప్రాంతాల్లో 42 డిగ్రీలకు మించి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించింది. గురువారం సాధారణ వాతావరణం నెలకొని ఉంటుందని, ఆ తర్వాత రెండ్రోజులు మళ్లీ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement