తెలంగాణలో 5.9 లక్షల కొత్త ఓటర్లు  | 5 Point 9 lakh new voters in Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో 5.9 లక్షల కొత్త ఓటర్లు 

Mar 16 2019 4:00 AM | Updated on Mar 16 2019 4:00 AM

5 Point 9 lakh new voters in Telangana - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 18–19 ఏళ్ల వయసు గల 1.5 కోట్ల మంది కొత్త ఓటర్లుగా నమోదయ్యారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. తెలంగాణలో 2019 ఓటరు నమోదు ప్రక్రియలో ఇప్పటివరకున్న గణాంకాల ప్రకారం 18–19 ఏళ్ల వయసు వారి సంఖ్య 5,99,933 ఉందని తెలిపింది. తెలంగాణలో ఓటర్ల సంఖ్య 2,95,18,964 ఉంది. ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య 1.46 కోట్లు కాగా.. పురుష ఓటర్ల సంఖ్య 1.48 కోట్లుగా ఉంది. థర్డ్‌ జండర్‌ ఓటర్ల సంఖ్య 1,368గా ఉంది. ప్రతి 1,000 మంది జనాభాకు 762 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఓటరు నమోదు ప్రక్రియలో ఇప్పటివరకున్న గణాంకాల ప్రకారం 18–19 ఏళ్ల వయసు ఉన్న కొత్త ఓటర్ల సంఖ్య 5,39,804గా ఉందని ఈసీ వెల్లడించింది. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091గా ఉంది. ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య 1.86 కోట్లు కాగా.. పురుష ఓటర్ల సంఖ్య 1.83 కోట్లుగా ఉంది. థర్డ్‌ జండర్‌ ఓటర్ల సంఖ్య 3,761గా ఉంది. ప్రతి 1,000 మంది జనాభాకు 697 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపింది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement