మున్సిపాలిటీల్లో మురికివాడలే అధికం | 32.18 per cent of the people do not have safe water | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీల్లో మురికివాడలే అధికం

Jun 1 2015 3:44 AM | Updated on Sep 3 2017 3:01 AM

మున్సిపాలిటీల్లో మురికివాడలే అధికం

మున్సిపాలిటీల్లో మురికివాడలే అధికం

మున్సిపాలిటీల్లో మురికివాడల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆయా ప్రాంతాల నుంచి పన్నులు సరిగా రావనే భావనతో...

32.18 శాతం మందికి సురక్షిత మంచినీరూ లేదు
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీల్లో మురికివాడల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆయా ప్రాంతాల నుంచి పన్నులు సరిగా రావనే భావనతో వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. కొన్ని మున్సిపాలిటీల్లో సాధారణ ప్రజలకంటే మురికివాడల్లో నివసిస్తున్న వారే ఎక్కువగా ఉండటం విశేషం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ పట్టణాభివృద్ధి పథకాలు నామమాత్రంగానైనా మురికివాడవాసులకు ఉపయోగపడడం లేదనే విషయం దీన్ని బట్టి స్పష్టమవుతోంది.

వందలాది స్వచ్ఛంద సంస్థలు, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ వంటి కార్యక్రమాలు మురికివాడ వాసులకు కనీస వసతులు కల్పించలేకపోయాయి.
 
దేశంలోనే రెండో స్థానం: దేశంలోని మురికివాడల జనాభాలో మన రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. దేశంలోని మురికివాడల జనాభాలో 15.6 శాతం మంది జనాభా 13 జిల్లాల్లోనే ఉన్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. 111 మున్సిపాలిటీల్లో మురికివాడవాసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.
 
వీధి దీపాలూ కరువే: పట్టణ స్థానిక సంస్థల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. మెజారిటీ మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సకాలంలో నిధులు ఇవ్వకపోవడం, ఇచ్చినవాటిని సకాలంలో ఖర్చుచేయకపోవడం వంటి కారణంగా వీధి దీపాలు కూడా లేని పరిస్థితి కొనసాగుతోంది. కొన్ని చోట్ల వారానికోసారి కూడా మంచినీరు లభించ డం లేదు. పట్టణ స్థానిక సంస్థల్లో మురికివాడ వాసుల సంఖ్యే అధికంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement