రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో సోమవారం సాయంత్రం పిడుగుపాటుతో ముగ్గురు మృతి చెందారు.
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో సోమవారం సాయంత్రం పిడుగుపాటుతో ముగ్గురు మృతి చెందారు. పెద్దతూప్రా గ్రామంలో పొలంలో పనులు చేసుకుంటున్న వారిపై పిడుగు పడి ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. అదే విధంగా పెద్దగోల్కొండ గ్రామంలో శ్రీకాంత్ అనే యువకుడు అక్కడికక్కడే చనిపోగా లోకేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా సోమవారం సాయంత్రం జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.