బస్సు, బైక్ ఢీ: ముగ్గురు మృత్యువాత | 3 died in road accident at karimnagar | Sakshi
Sakshi News home page

బస్సు, బైక్ ఢీ: ముగ్గురు మృత్యువాత

Dec 16 2015 2:32 PM | Updated on Aug 30 2018 3:56 PM

కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలం స్తంభంపల్లి వద్ద బుధవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది.

ధర్మపురి: కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలం స్తంభంపల్లి వద్ద బుధవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో  ముగ్గురు మృత్యువాతపడ్డారు. వివరాలు ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం కొత్తూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బైక్‌పై కరీంనగర్‌లో జరిగే వివాహానికి వెళ్తున్నారు. స్తంభంపల్లి వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మృతులు ఆదిలాబాద్ జిల్లా లక్షెట్టిపేట్ మండలం గంపలపల్లి గ్రామానికి చెందిన వెగ్గడి శ్రీధర్(19), కొత్తూర్ గ్రామానికి చెందిన మోటపల్కుల ప్రవీణ్(14), మండ అశోక్ (20) లుగా గుర్తించారు. లారీని ఓవర్‌టేక్ చేయబోయే యత్నంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును వీరి బైక్ ఢీకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement