ప్రభుత్వ కార్లంట..పనికి రావంట..!

200 Cars Wastage In Secretariat - Sakshi

‘రాజుల సొమ్ము రాళ్లపాలు’ అన్నట్టు...ప్రభుత్వ వాహనాలు ‘తుప్పు’ పట్టిపోతున్నాయి. హోండా సిటీ.. కరోలా ఆల్టిస్‌.. మహీంద్రా స్కార్పియో..అలనాటి అంబాసిడర్లు.. ఆటోలు.. వ్యాన్లు ఇలా ఖరీదైన వాహనాలెన్నో సచివాలయంలో ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోయాయి. ఈ వాహనాలు ఎందుకువినియోగించడం లేదో తెలియడం లేదు.

హోండా సిటీ.. కరోలా ఆల్టిస్‌.. మహీంద్రా స్కార్పియో.. ఇంకా అలనాటిరాజ వాహనం అంబాసిడర్లు.. ఆటోలు.. వ్యాన్లు ఎన్నో అక్కడ పడివున్నాయి. ఎవరికీ పట్టనట్టున్నాయి. దుమ్ము కొట్టుకుపోయి.. శిథిలమైపోయి, పాక్షికంగా పాడైపోయి, పార్టులు పీకేసి.. చెట్ల కింద.. గోడ పక్కనా కార్లే. ఎటుచూసినా కార్లే. పదో, ఇరవయ్యో కాదు.. సుమారు 200 కార్లు. ఈఎంఐలు కట్టలేక దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో కార్లు వదిలేసినవి కావు. నగరం నడిబొడ్డునున్న సెక్రటేరియట్‌లో కనిపించే పరిస్థితి ఇది. ప్రతి కారుకు ‘గవర్నమెంట్‌ వాహనం’ అన్న బోర్డులు సైతం ఉన్నాయి. ఎవరికోసం కొనుగోలు చేశారో.. ఎంతకాలం వాడారోగాని ఇప్పుడు ఎవరికీ కాకుండావదిలేయడంతో తుప్పు పట్టిపోతున్నాయి. వేలం వేసినా ప్రభుత్వానికి ఎంతోఆదాయం సమకూరేది. కానీ ఎవరికీ పట్టనట్టు వదిలేశారు.

– ఫొటోలు: ఎం. అనిల్‌కుమార్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top