ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగలు పడి బీరువాలో ఉన్న 20 తులాల బంగారం రూ. 5 వేల నగదు దోచుకెళ్లారు.
హైదరాబాద్: ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగలు పడి బీరువాలో ఉన్న 20 తులాల బంగారం రూ. 5 వేల నగదు దోచుకెళ్లారు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆరాంఘర్ లక్ష్మీనగర్ విల్లాస్ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న కృష్ణమూర్తి అనే ఉద్యోగి ఉదయం ఇంటికి తాళం వేసి సాయంత్రం తిరిగి వచ్చారు. వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి ఉండటంతో అనుమానం వచ్చి బీరువా తెరిచి చూడటంతో ఇంట్లో ఉన్న 20 తులాల బంగారు ఆభరణాలు, రూ. 5 వేల నగదు కనబడలేదు.
దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.