దోపిడీ దొంగల బీభత్సం:20 ఇళ్లల్లో చోరీ | 20 houses robbed in warangal | Sakshi
Sakshi News home page

దోపిడీ దొంగల బీభత్సం:20 ఇళ్లల్లో చోరీ

Nov 21 2014 11:06 AM | Updated on Aug 30 2018 5:27 PM

వరంగల్ జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.

వరంగల్:జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. శుక్రవారం ఉదయం 20 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డ దొంగలు భారీ ఎత్తున బంగారాన్ని, నగదును దోచుకెళ్లారు. ములుగు శివారు ప్రాంతంతో పాటు, ప్రేమ్ నగర్, జాకారంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో 20 తులాల బంగారాన్ని, రూ. లక్ష నగదును అపహరించారు.

 

దొంగలను అడ్డుకున్నఒక జంటపై ఇనుప రాడ్లతో దాడి దిగారు. దీంతో వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఉదంతంతో ఉలిక్కిపడిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గత నెలలో జిల్లాలో ఇదే క్రమంలో దోపిడి జరగడంతో దానిపై పోలీసులు దృష్టి సారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement