కారు, లారీ ఢీ ఇద్దరికి తీవ్ర గాయాలు | 2 injured in road accident | Sakshi
Sakshi News home page

కారు, లారీ ఢీ ఇద్దరికి తీవ్ర గాయాలు

Jan 17 2015 4:27 PM | Updated on Aug 30 2018 3:58 PM

నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు అదేదారిలో వెళ్తున్న లారీని శనివారం మద్యాహ్నం ఢీకొట్టింది

మునగాల: నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద  ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు అదే దారిలో వెళ్తున్న లారీని శనివారం మద్యాహ్నం ఢికొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదానికి గురైన వాళ్లు హైదరాబాద్ సైనిక్‌పురి ప్రాంతానికి చెందిన మహేష్ బాబు, ఆయన భార్య గీతగా గుర్తించారు. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం సుర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్న వాళ్ల కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. గత నెలలో ఇదే ప్రాంతంలో నందమూరి జానకి రామ్ కారు ప్రమాదానికి గురై మరణించిన విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement